తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి ఎం.ఐ.జి కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దుర్గాష్టమి, ఆయుధ పూజ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్ వారి సతీమణి శ్రీమతి రాగం జాగృతి సాయి, రాగం అభిషేక్ యాదవ్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో వాహనాలకు ఆయుధ పూజలుచేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
