తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: లింగంపల్లి సగర సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను మహిళల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సగర సంఘం సభ్యులు, మహిళలు కీలక పాత్ర పోషించారు. అందరి సహకారంతో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎం. ఈశ్వర్ సాగర్ లింగంపల్లి సగర సంఘం గౌరవ అధ్యక్షులు ఎం. వెంకటేష్ సాగర్, ప్రధాన కార్యదర్శి ఎం. చంద్రశేఖర్ సాగర్, కోశాధికారి వై. భీమయ్య సాగర్ తదితరులు పాల్గొన్నారు. మహిళల ఐక్యతకు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు బతుకమ్మ వేడుకలు ప్రతీకగా నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో పాల్గొన్న మహిళలందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.