తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు, నియోజకవర్గ ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసిన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. శేరిలింగంపల్లి వాడ వాడలా అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. తెలంగాణ ఆచార సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీలో తాజా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పర్యవేక్షణలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ , తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆడపడుచులందరికి సద్దుల బతుకమ్మ పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని తెలియచేశారు. పూల సంబురం, పుడమి సంబురం, ఆడపడుచుల ఆనంద సంబురం బతుకమ్మ పండుగ సంబురం అని, బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపదమాసం అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల పండుగ చివరి రోజు జరుపుకుంటారని, తెలంగాణ ఆడబిడ్డలందరికీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఆడబిడ్డలందరికి సద్దుల
బతుకమ్మ పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని తెలియచేశారు. ఆడపడుచులు తొమ్మిది రోజులు తీరొక్క పూలతో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియచేశారు. బతుకమ్మ బతుకునిచ్చే పండుగ, ఆడపడుచుల అపురూప పండుగ, ప్రపంచంలో దేవున్ని పూలతో పూజచేస్తె, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ పువ్వులనే దేవతగా పూజించే అతి గొప్ప పర్వదినం అని, తెలంగాణఆచార , సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ అని , పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల పూలపండుగ బతుకమ్మ వేడుక తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళా సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు
