తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: బోడుప్పల్‌లోని దేవి గార్డెన్స్‌లో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు *టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ , కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ హాజరై వజ్రేష్ యాదవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా *బండి రమేష్ మాట్లాడుతూ, వజ్రేష్ యాదవ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి మరింత సేవలందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో *పుష్ప రెడ్డి, లక్ష్మయ్య,మస్తాన్ రెడ్డి, అరవింద్ రెడ్డి, అస్లాం, రమణ , నలినీకాంత్, రవి* తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వజ్రేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
