తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదు బండ గ్రామంలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయం ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధిని ప్రత్యేక శ్రద్ధతో అంకిత భావంతో ఆ వీరాంజనేయ స్వామిపై అత్యంత భక్తి భావంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాటుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా విజయదశమి పర్వదినం రోజున భక్తులకు అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో దేవాలయ ఆవరణలో జమ్మిచెట్టు ఏర్పాటుచేసిన నేపథ్యంలో భక్తజనులు తండోపతండాలుగా మసీదు బండ గ్రామంలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయానికి విచ్చేసి జమ్మిచెట్టుకు విశేషమైన పూజలుచేసారు. అనంతరం, జమ్మి ఆకులను సేకరించి భక్తి భావంతో బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ఆత్మీయులకు బంగారు కానుకగా అందజేసి అలయ్ బలయ్ పేరుతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్బంగ భక్తులు మాట్లాడుతు, శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ విజయదశమి రోజున భక్తులకు అందుబాటులో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో జమ్మిచెట్టును ఏర్పాటుచేయడం అభినందనీయమని, శ్రీ వీరాంజనేయ స్వామి కృపా కటాక్షాలతో ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ మాట్లాడుతు, విజయదశమినాడు జమ్మిచెట్టుకు పూజ చేయడం మన సంప్రదాయమని, దీన్ని సంస్కృతంలో శమీ వృక్షంగా పిలుస్తారని జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటారని పెద్దవాళ్ల ఆశ్వీరాదాలు తీసుకుంటారని అలయ్ బలయ్ పేరుతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకుంటారని తెలిపారు.
