తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం
చందానగర్ హుడా కాలనీలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. దసరా పర్వదినం పురస్కరించుకొని శమీ పూజలుచేసిన సుమారు 500భక్తులకు శ్రీ రాజా రాజేశ్వరి దేవి దర్శనమిచ్చారు. పోలా సాయిబాబు దంపతులు అన్న ప్రసాద వితరణ చేశారు. ఫౌండర్ చైర్మన్ పోలా కోటేశ్వర రావు వాణి దంపతులు ప్రతిరోజు ఉదయం అభిషేకం కుంకుమ పూజ , బతుకమ్మ హోమం, శమి పూజలో పాల్గొన్నారు. దేవాలయ సభ్యులు ఉష రాణి శ్రీకాంత్ వినయ్ మారం వెంకట్ రాము కట్కూరి శ్రీనివాస్ శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సభ్యులు అధిక సంఖ్యలో పూజలలో పాల్గొని అమ్మ వారి కృపకు పాత్రులైనారు.