తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి శనివారం, మంగళవారం శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనార్దమై విచ్చేస్తున్న భారతీయ స్టేట్ బ్యాంకు విశ్రాంత ఉన్నత అధికారి పెండ్యాల చంద్రశేఖర్ ఈ శనివారం కూడా శ్రీశ్రీశ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగ పెండ్యాల చంద్రశేఖర్ మాట్లాడుతు, కొండాపూర్ మజీద్ బండ గ్రామంలో శ్రీ స్వయంభూ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్న ఆలయ ధర్మకర్త శ్రీ మారబోయిన సందీప్ యాదవ్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ స్వామివారిని దర్శించుకునే అదృష్టాన్ని కలగజేసినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటామని తెలియజేశారు. వీరాంజనేయ స్వామి వారి కృపాకటాక్షాలతో మారబోయిన సందీప్ యాదవ్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా తెలియజేశారు. ఇటీవల ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీ షణ్ముఖ శర్మ శ్రీ స్వయంభూ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుని వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారని, ఆలయ ప్రాంగణంలో రెండు మర్రి చెట్లు, జమ్మి చెట్టు వుండడం దేవాలయ విశిష్టతను తెలియజేస్తున్నదని కొనియాడారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు శ్రీ వీరాంజనేయ స్వామి వారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయని ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ను కొనియాడారు.
