తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గం, మూసాపేట్ డివిజన్‌లోని శ్రీ విఠల్ రుక్మిణి దేవాలయంలో గ్యాన్ బా తుకారాం, జై జై రామ్ కృష్ణ హరి ఆహ్వానం మేరకు నిర్వహించిన పాల్కి సోహళా ఉత్సవంలో ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టిపిసిసి ఉపాధ్యక్షులు కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగ సచిన్ సావంత్ బండి రమేష్ మాట్లాడుతు, భారతదేశం అనేక భాషలు, మతాలు, సంస్కృతులు కలిగిన దేశం. కానీ మనల్ని కలిపి ఉంచేది మన ఐక్యత, మన సోదరభావం. మానవత్వంతో మనమంతా ఒక్కటిగా నిలబడాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, లక్ష్మయ్య,, గోపిశెట్టి రాఘవేందర్, గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు, డివిజన్ అధ్యక్షులు, తూము సంతోష్, కాలికోట శంకర్, రాజేష్ శంకర్ కుమార్ గౌడ్, నియోజకవర్గం మైనారిటీ చైర్మన్ ఎండీ చున్ను పాషా, కాంగ్రెస్ నాయకులు సతీష్ గౌడ్, సప్పిడి భాస్కర్, కాలికోట బాలరాజ్, శివా చౌదరి, తూము సచిన్, టీంకు కార్యకర్తలు, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు