తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ బృందావనం కాలనీ మెయిన్ రోడ్డు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెష్ టిఫిన్స్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరీలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరై రిబ్బన్ కట్ చేసి టిఫిన్ సెంటర్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, నూతనంగా వ్యాపారం ప్రారంభించడం అభినందనీయమని నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకే అందించి ప్రజల మన్ననలు పొందాలని నూతన వ్యాపార సంస్థ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం, ఫ్రెష్ టిఫిన్స్ సెంటర్ యాజమాన్యులైన సంపత్, మల్లికార్జున్ , వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కే. ఎల్లేష్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఎస్ఎల్వి డిసి ప్రెసిడెంట్ రవి యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ దేవులపల్లి, కిషోర్, ప్రదీప్, కిరణ్ యాదవ్, ముక్రమ్, సమీర్, అజార్, షైబాజ్, దావుడ్, కుమార్, రేవంత్, భరత్ గౌడ్, హరీష్, మల్లేష్, రఘు, మహేష్, విజయ్, నాందేవ్, సురేష్ తదితర స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
