హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పనులు, దళిత బంధు, అంబేద్కర్ భవన్‌పై చర్చ

హైదరాబాద్,తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్

హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులు, దళిత బంధు పథకం అమలు, అంబేద్కర్ భవన్‌కు సంబంధించిన అంశాలపై మంత్రులతో ప్రణవ్ ప్రత్యేకంగా చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.