తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన 450 డయ పైప్ లైన్ నిర్మాణం పనులు, బొల్లారం మెయిన్ రోడ్డు నుంచి గుర్నాధం చెరువు వరకు నూతనంగా నిర్మిస్తున్న ఆర్ సీసీ బాక్స్ డ్రైన్ వరద నీటి కాలువ నిర్మాణంపనులను మియాపూర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , కాలనీ వాసులు,సీఎమ్సీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన 450 డయ పైప్ లైన్ నిర్మాణం పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించడం జరిగినదని, స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే అంశాలపై అధికారులతో కలసి పరిశీలించడం జరిగినదని,అభివృద్ధి పనుల ప్రణాళికలు, వాటి అమలుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తూ, ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాల్సిన అవసరాన్ని వారు అధికారులకు తెలిపారు. అనంతరం, బొల్లారం మెయిన్ రోడ్డు నుంచి గుర్నాధం చెరువు వరకు నూతనంగా నిర్మిస్తున్న బాక్స్ డ్రైన్ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో వరదనీటి ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తకుండా, నీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో ఈ పనులు కీలకంగా మారుతాయని. బాక్స్ డ్రైన్ కాలువ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీకాంత్ సూచించారు,మియాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీలలో మౌలిక సదుపాయాల మెరుగుదల, వర్షపు నీటి సమస్యల పరిష్కారం, చెరువుల పరిసరాల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ప్రజలకు ఎదురయ్యే సమస్యలను గుర్తించి ఆరెకపూడి గాంధీ సహకారంతో ప్రతి కాలనీలలో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపే దిశగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్తామని ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎమ్సీ అధికారులు,ఏఈఈ. ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్లు జగదీష్, నవీన్ కాలనీ వాసులు సాంబయ్య , బాలు నాయుడు, తదితరులు పాల్గొన్నారు
