తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, భారత రాజ్యాంగ స్ఫూర్తి సంరక్షణ, ప్రతి పౌరుడి ఓటు హక్కుకు భద్రత కల్పించాలనే లక్ష్యంతో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో ఢిల్లీ ఓటు బచావో, దేశ్ బచావో జాతీయ స్థాయి ఉద్యమంలో వ ఉత్సాహంగా పాల్గొన్నారు. నవంబర్ 1న న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమం, మహా మార్చ్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి రాంలీలా మైదానం వరకు సాగిన మహా మార్చ్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి అడుగులు వేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రముఖులు, ఇండియా కూటమి నాయకులు పాల్గొని ఓటు హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, రాజ్యాంగ విలువల సంరక్షణపై తమ గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ ,వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇడుపుగంటి సుబ్బారావు , ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య, డీసీసీ అధ్యక్షులువజ్రేష్ యాదవ్, కూన శ్రీశైలం, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ తో యలమంచి ఉదయ్ కిరణ్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, ఓటు హక్కు అనేది కేవలం రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే కాదు. పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల బలం, వారి గొంతుక, ఆత్మగౌరవం. దేశ భవిష్యత్తును నిర్ణయించే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య సాధనం. ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉండాలి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రతి పౌరుడి ఓటు హక్కుకు సంపూర్ణ గౌరవం, రాజ్యాంగ విలువలకు రక్షణ ఉండాలని పేర్కొన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉద్యమంలో భాగస్వామ్యం కావడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణ, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ జాతీయ ఉద్యమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పాల్గొని తమ రాజకీయ నిబద్ధతను, ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,మహిళా నాయకులు,యూత్ కాంగ్రెస్ నేతలు,పలువురు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.