తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, చందానగర్ డివిజన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు 26సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన నిధుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల ప్రీతమ్ మరియు సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు రూ.3లక్షల విలువైన చెక్కును పోలీసు అధికారులకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని, నేరాల నియంత్రణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ప్రజల భద్రత కోసం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. పోలీసు అధికారులు కాంగ్రెస్ నాయకులు మిరియాల ప్రీతమ్, మిరియాల రాఘవరావు అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విరాళం ద్వారా సీసీ కెమెరాల ఏర్పాట్లపనులు మరింత వేగంగా పూర్తవుతాయని పేర్కొన్నారు.