తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  హైడ్రాలో (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) మొత్తం 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్ 100 పోస్టులు, హెవీ వెహికల్ డ్రైవర్ 50 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత విద్యార్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహించే శారీరక దారుఢ్య పరీక్షల్లో 800 మీటర్ల పరుగు 2 నిమిషాల 50 సెకన్లలో, 100 మీటర్ల పరుగు 15 సెకన్లలో, లాంగ్ జంప్ 4 మీటర్లు, 7.26 కిలోల షాట్‌పుట్‌ను 6 మీటర్లు విసరాల్సి ఉంటుంది. అభ్యర్థులు 10వ తరగతి ఒరిజినల్ మెమో, గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా సమర్పించాలి.శారీరక పరీక్షలు ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.