తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి సందర్భంగా రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) ఆడిటోరియంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరై, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోకల శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అందించిన దార్శనికత, అచంచలమైన అంకితభావం చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్య, సామాజిక న్యాయం, ప్రజాసేవ పట్ల ఆయన జీవితాంతం చూపిన నిబద్ధత ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. తెలం గాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, చూపిన మార్గం భావితరాలకు స్ఫూర్తిదాయక మని తెలిపారు. అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణంలో జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వై. శ్రీధర్, కొమరయ్య, శేఖర్ ముదిరాజ్, వెంకటేష్, సంతు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, బాబురావు, పవన్ సాయి, లంకల సాయి, వెంకటరెడ్డి, అమర్ రెడ్డి, వేణుగోపాల్, దయానంద్ రెడ్డి, రమేష్, విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
