తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: మియాపూర్ క్యాంపు కార్యాలయంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే గాంధీతో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలకు డిజిటల్ రేషన్ కార్డులు అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా ప్రజలకు చేరువవుతున్నాయని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ, మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో పాటు కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస్ రావు, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, రాజేష్ యాదవ్, రాజు యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, మిర్యాల ప్రీతం, నీరుడి గణేష్ ముదిరాజ్, అక్తర్, తిరుపతి యాదవ్, బసవ రాజు, రవి శంకర్ నాయక్, మోహన్ గౌడ్, శ్రీనివాస్ చౌదరి, రజనీకాంత్, దిలీప్, అబ్దుల్ ముక్తార్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు.
