తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా 8వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమాండెంట్‌తో పాటు అసిస్టెంట్ కమాండెంట్లు బి. సత్యనారాయణ , సునీల్,ఎస్.రాంబాబు, ఆర్‌ఐ పూర్ణచంద్రరావు , ఎస్‌ఐ సత్యనారాయణ , మహేందర్ రెడ్డి తదితరులను చాంద్ పాషా కలిశారు. ఈ సందర్భంగా బెటాలియన్‌కు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో ఆత్మీయంగా మాట్లాడారు. కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలు విజయవంతంగా కొనసాగాలని షేక్ చాంద్ పాషా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, ప్రసాద్ గుప్తా, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

You missed