తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: భారత్ నగర్‌లోని గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యారంగ అభివృద్ధికి, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రకు సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, తూము వేణు, ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి, టెంపుల్ చైర్మన్ మూర్తి, వెంకటేష్ యాదవ్, బాలరాజు, క్రాంతి, రమణ, సంతోష్ తదితరులతో పాటు ఉపాధ్యాయులు రత్నారావు, లక్ష్మీ, రాజారావు, పలువురు పాల్గొన్నారు.