తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు శ్రీరామ కాలనీలోని కోటి విద్య స్కూల్ ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. “మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.రసాయనాలతో తయారు చేసిన గణపతి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటిలోని హానికరమైన రసాయనాలు నీటిలో కలిసే అవకాశం ఉందన్నారు. దీంతో జలచరాలకు, నీటిని వినియోగించే ప్రజలకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందని వివరించారు..మట్టి గణపతులను పూజించి నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని, జల వనరులను కాలుష్యం నుంచి కాపాడవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. ప్రతి ఇంట్లో మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.