తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కార్వాన్ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో రాబోయే గణేష్ ఉత్సవాలు, గణేష్ విగ్రహాల ఆగమనం కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కుల్సుంపురా పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాములును కలిసి సమావేశమయ్యారు. ఉత్సవాలను శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పోలీసుల సహకారం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి దాసరి దుర్గారాజు, న్యాయ సలహాదారు ఉత్తరపల్లి దయానంద్, సంయుక్త కార్యదర్శులు వద్దేపల్లి యోగేష్, నమాని సాయి పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సామాజిక బాధ్యతతో నిర్వహించేందుకు సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సభ్యులు తెలిపారు.