తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీడియా నిరంతరం వారధిలా పనిచేస్తుందని మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిచెన్న లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) పేర్కొన్నారు. ‘మన ఊరి న్యూస్’ మొబైల్ యాప్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమైనదని, క్షేత్రస్థాయిలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో డిజిటల్ మీడియా ముందుంటోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల వార్తలను, ప్రజల గొంతును ప్రపంచానికి వినిపించడానికి ఈ ‘మన ఊరి న్యూస్’ యాప్ ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు మరియు యాప్ నిర్వహణ ప్రతినిధులు పాల్గొన్నారు.
