తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కరీంనగర్: బీసీ హక్కుల సాధన, సామాజిక న్యాయం, పద్మశాలీ సమాజ అభ్యున్నతి, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత రెండు దశాబ్దాలుగా కృషి చేస్తున్న దాసు సురేష్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం ఆయన అభ్యర్థిత్వాన్ని సానుకూలంగా పరిశీలించాలని కోరారు.
కరీంనగర్లో నిర్వహించిన ఎలక్ట్రానిక్ మీడియా బైట్స్‌లో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి గడప కోటేష్ మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం, హక్కుల సాధన, పద్మశాలీ సమాజ అభ్యున్నతి, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దాసు సురేష్ నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ నాయకత్వానికి గుర్తింపు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయానికి మరింత ప్రాధాన్యం లభిస్తుందని అన్నారు.
బీసీ రాజ్యాధికార సమితి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా పరిమితం కాకుండా రాజకీయ నిర్ణయాల్లో భాగస్వాములుగా ఎదగాలని అన్నారు. బీసీల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వ స్థాయి వరకు వినిపిస్తున్న దాసు సురేష్‌కు చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా బీసీ సమాజ ఆకాంక్షలకు గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి అతికం రాజశేఖర్ మాట్లాడుతూ.. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యల పరిష్కారానికి దాసు సురేష్ చేస్తున్న కృషిని గుర్తించాలని అన్నారు. ముఖ్యంగా చేనేత కార్మికుల సంక్షేమం, బీసీల ఆత్మగౌరవం, రాజకీయ సాధికారత కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు తగిన గుర్తింపు రావాలని పేర్కొన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే బీసీల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించేందుకు మరింత అవకాశం లభిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు ఓటు హక్కుతో పాటు అధికారంలోనూ సముచిత భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, బీసీల రాజకీయ సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రెండు దశాబ్దాలుగా బీసీ సమాజం కోసం పనిచేస్తున్న దాసు సురేష్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
