తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వర్కింగ్ చైర్మన్‌గా నియమితులైన షేక్ నవాజ్ ఘనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగ జనతా నగర్ లోని తన నివాసం నుంచి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హేమదుర్గా భవన్‌కు చేరుకున్నారు. అనంతరం, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సమక్షంలో షేక్ నవాజ్ కూకట్పల్లి నియోజకవర్గ మైనారిటీ వర్కింగ్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగ బండి రమేష్ మాట్లాడుతు, కాంగ్రెస్ పార్టి అంటేనే అన్ని వర్గాలకు సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించే పార్టి మైనారిటీ సోదరుల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టి ఎప్పుడూ ముందుంటుంది అని ప్రతి ఒక్కరికీ రాజకీయంగా ఎదిగే అవకాశం కాంగ్రెస్ పార్టి కల్పిస్తుంది అని షేక్ నవాజ్ కి అప్పగించిన పదవి, బాధ్యత సమర్థవంతంగ నిర్వహిస్తు, మైనారిటీ సోదరుల సమస్యలను గుర్తించి, వారి గొంతుకగా నిలుస్తారని అన్నారు ఈ సందర్బంగ షేక్ నవాజ్ మాట్లాడుతు , కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ వర్కింగ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం నాకు ఎంతో సంతోషంగ ఉంది. నాపై నమ్మకంతో ఈ బాధ్యత ను అప్పగించిన బండి రమేష్ కి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. బండి రమేష్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి డివిజన్లోని నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటు అంకితభావంతో పని చేస్తాను అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా వర్క్స్ బోర్డు మెంబెర్ అడ్వకేట్ హుస్సేన్, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టి జిల్లా ఉపాధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్, మైనారిటీ చైర్మన్ ఎండీ చున్ను పాషా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సలీం రాష్ట్ర ఓబిసి వర్కింగ్ చైర్మన్ తూము వినయ్, కాంగ్రెస్ నాయకులు పులి శివా, సప్పిడి భాస్కర్, డివిజన్ అధ్యక్షులు తూము సంతోష్, కాలికోట శంకర్, రాజేష్ గౌడ్, మైనారిటీ వైస్ చైర్మన్ ఎండీ నయీమ్, కాంగ్రెస్ నాయకులు రమణ, అక్బర్, మల్లేష్ యాదవ్, అస్లాం, తూము సచిన్, ఎండీ యూసఫ్ పాషా, కాంగ్రెస్ పార్టి అన్ని విభాగాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని షేక్ నవాజ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఆత్మీయ విందు షేక్ నవాజ్ ఏర్పాటు చేయడం జరిగింది.
