తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ (SC Cell) రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్ మరియు సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు తప్పటి శంకర్ ఆధ్వర్యంలో ఒక కీలక నియామకం చేపట్టారు.చిన్నకోడూరు మండలం, మైలారం గ్రామానికి చెందిన వడ్లూరి అశోక్‌కు సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, దళిత సామాజిక వర్గాల సంక్షేమానికి అశోక్ చురుగ్గా పనిచేయాలని ఆకాంక్షించారు. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు వడ్లూరి అశోక్ పార్టీ అధిష్టానానికి, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ కొత్తూరి నరహరి, బండమీద తిరుపతి, చిన్నకోడూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మంద శ్రీకాంత్, INTUC జిల్లా ప్రెసిడెంట్ వడ్లకొండ రవి, పొట్ల ప్రసాద్, స్వామి మరియు స్థానిక రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
