• మధిర బీసీల ఐక్యవేదిక ఏకగ్రీవ తీర్మానం
• గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
• బీసీ హక్కులు, చేనేత సంక్షేమం, విద్యా–వైద్య రంగాల్లో సేవలకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, మధిర: బీసీ ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యంకు తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని మధిర నియోజకవర్గ బీసీల ఐక్యవేదిక ఏకగ్రీవంగా తీర్మానించింది. బీసీల హక్కుల సాధన, చేనేత కార్మికుల సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఎమ్మెల్సీ పదవికి ఆయన పేరును ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని వివిధ బీసీ కుల సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.
మధిరలోని స్థానిక క్రియేషన్ క్లబ్లో అక్టోబరు 27న నిర్వహించిన సమావేశంలో వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ వర్గాల సమస్యలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై చర్చించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న నాయకులకు తగిన గుర్తింపు లభించాలని అభిప్రాయపడ్డారు.
బీసీ వర్గాలకు విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమలులో మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు. చేనేత కార్మికుల జీవనోపాధి, సామాజిక భద్రత, విద్యార్థుల సమస్యలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధి వంటి అంశాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో గుజ్జ సత్యం సేవలను గుర్తించి ఆయన పేరును గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్‌కు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
వివిధ కుల సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యం
ఈ సమావేశంలో వడ్డెర సంఘం నుంచి చింతల నాగవేశ్వరరావు, అంకెల గోపి, తాటి నరసింహారావు, మెరిమీదుల నరసయ్య పాల్గొన్నారు. దాసరి సంఘం నుంచి కంభం శివకృష్ణతో పాటు మూడు మండలాలకు చెందిన ప్రతినిధులు కృష్ణ, రామారావు, రామకోటేశ్వరరావు, సాంబశివరావు, సంతోష్, రాజేష్, నవీన్, విక్రమ్ హాజరయ్యారు.
పద్మశాలి సంఘం నుంచి కూరపాటి శ్రీనివాసరావు, వద్దండయ్య, కనకరావు, లక్ష్మారావు; రజక సంఘం నుంచి వేల్పుల శ్రీనివాసరావు, గోపి, కోటేశ్వరరావు, రామారావు, కృష్ణ పాల్గొన్నారు. కుమ్మర సంఘం నుంచి సత్యనారాయణ, కొండలరావు, ప్రశాంత్ ప్రజాపతి, అనిల్, చంద్ర; మేదర సంఘం నుంచి సంఘపు కృష్ణారావు, అనంతల శ్రీనివాస్, పుల్లయ్య, నాగేశ్వరరావు హాజరయ్యారు.
వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు సమావేశంలో పాల్గొని గుజ్జ సత్యం అభ్యర్థిత్వానికి తమ మద్దతు ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు.
మధిరలో పూలే విగ్రహ ఏర్పాటుకు తీర్మానం
బీసీ కులాల ఐక్యత, సామాజిక చైతన్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మధిర నియోజకవర్గ బీసీ కులాల ఐక్యవేదిక తరఫున త్వరలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం పూలే చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రతినిధులు ప్రస్తావించారు.
గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలనే తమ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని మధిర నియోజకవర్గ బీసీల ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు. నామినేషన్‌కు సంబంధించిన రాజ్యాంగపరమైన అర్హతలు, నిబంధనలకు అనుగుణంగా ఆయన పేరును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
