తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి దివ్యాంగుల పట్టణ సమైక్య సంఘం అధ్యక్షులు మేకల అశోక్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల ఎమ్మార్వో మహిపాల్ రెడ్డికి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అధికారికంగా దివ్యాంగుల స్వయం ఉపాధి సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేసారు. అనంతరం, అశోక్ కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో దివ్యాంగుల స్వయం ఉపాధి సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలని నియోజకవర్గంలో దాదాపు 3000నుండి 4000మంది వివిధ రకాల దివ్యాంగులు ఉన్నారని దివ్యాంగులకు ఎలాంటి భవనం లేక ప్రతి నెల సమైక్య సంఘం సమావేశాలు, ఉపాధి చేసుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని మానసిక వైకల్యం ఉన్న దివ్యాంగులకు వృత్తిపరమైన ప్రత్యేకన కోర్స్ చేసుకోవటానికి భవనం కావాలని దివ్యాంగులపై దయఉంచి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అధికారికంగా దివ్యాంగుల స్వయం ఉపాధి సంక్షేమ భవనం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి వెంకటేష్ ఆరిఫ్ షబ్బీర్ రషీద్ శీను తదితరులు పాల్గొన్నారు.