తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి పారిజాత నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓట్ బచావో దేశ్ బచావో రంగారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో రాష్ట్ర యాదవ, కురుమ కార్పొరేషన్ చైర్మన్ ఎమ్ రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగ రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత జనాభా కలిగిన జిల్లాల్లో ఒకటైన రంగారెడ్డి జిల్లాలో సగం ఓట్లు తొలగించారనే అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఓటర్ల జాబితాలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ. అబ్జర్వర్ మోహన్ కుమార్ మంగళం, మాజీ జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి, చేవెళ్ల భీమ్ భరత్ , శేరిలింగంపల్లి జగదీశ్ గౌడ్, కార్పొరేషన్ చైర్మన్లు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , శ్రీమతి సుజాత, మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ,యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
