తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మూసీ బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నిర్వహిస్తున్న సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న హైదరగూడ, అత్తాపూర్ ప్రాంతాల బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా హైదరగూడ–అత్తాపూర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
బాధితులకు మద్దతుగా నిలిచే నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో హైదరగూడ డివిజన్ అధ్యక్షుడు చెట్టిగారి నరేందర్ రావు, అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరామ్ రెడ్డి, జే. చిత్తరి, బంగి శ్రీను, నల్లింగ్ అజయ్ కుమార్, సి. హరీష్ రావు, ఆర్. సాయినాథ్ రెడ్డి, మధు, లక్ష్మణ్, పాశం నరేందర్ రెడ్డి, శ్రీవర్ధన్ రెడ్డి, కృష్ణారావు తదితర నాయకులు పాల్గొన్నారు. మూసీ బాధితులకు అండగా నిలుస్తూ, వారి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
