తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్ సఫారీ నగర్‌లో వీధి దీపాలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల సమస్యలను సీనియర్ నాయకులు చాంద్ పాషా బుధవారం పరిశీలించారు. ఈ సమస్యలను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగ స్థానికులు మాట్లాడుతు, ప్రజల సమస్యలను పరిశీలించి పరిష్కార చర్యలకై ఎమ్మెల్యేతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన చాంద్ పాషా కు కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు తెలియజేశారు.