తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్, నెహ్రు నగర్, బాపూనగర్, ప్రశాంతి నగర్, పరిసర బస్తీలలో నివసిస్తూ జీవనం కొనసాగిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు తమ అధికారిక కార్యక్రమాలు, శుభకార్యాలు జరుపుకోవడానికి సరైన స్థలంలేక, ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ల అధిక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పిఏసి చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో సంబంధిత అధికారులతో చర్చించి గోపినగర్ లో సుమారు రూ. 2.5కోట్ల రూపాయల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే జీ ప్లస్ వన్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ స్థలాన్ని సిఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు డిఈ ఆనంద్, ఏఈ భాస్కర్, స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, గోపినగర్, నెహ్రు నగర్, బాపూనగర్, ప్రశాంతి నగర్ పరిసర బస్తీలలోని పేద ప్రజలు తమ ఇంట్లో జరిగే చిన్న చిన్న శుభకార్యాలకు కూడా ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లకు వేలకు వేలు అద్దె చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి ఈ ఫంక్షన్ హాల్ కోసం కృషి చేస్తున్నామని అన్నారు. సుమారు రూ. 2.5కోట్లతో నిర్మించబోయే ఈ జీ ప్లస్ వన్ ఫంక్షన్ హాల్ లో ఒకేసారి 500 మంది కూర్చునే సౌకర్యం, వంటగది, మరుగుదొడ్లు తదితర అన్ని ఆధునిక సౌకర్యాలు ఉంటాయని దీనివల్ల పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రభుత్వపరమైన సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు వంటివి కూడా నిర్వహించుకోవచ్చని తెలిపారు. నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, శ్రీకాంత్ దేవులపల్లి, సత్యనారాయణ, నర్సింహా రెడ్డి, మహేష్ చారీ, సాయన్న, ప్రభాకర్ యాదవ్, మహేందర్ సింగ్, విజయ్, రేణు, మహేష్, సంతోష్, మహిళలు ముంతాజ్ బేగం, చందాదేవి, సుధారాణి, కమలమ్మ, నర్సమ్మ, హైమవతి, భాగ్యమ్మ, తదితర బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
