తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్ష్యులు వీ రాజేష్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు శిబిరాన్ని ముఖ్య అతిదిగా విచ్చేసి ప్రారంభించిన కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా
తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత అవగాహన కల్పించాలని బండి రమేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్ష్యులు తూము వేణు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిశెట్టి రాఘవేందర్, డివిజన్ల అధ్యక్షులు నాగార్జున, పులి శివ గౌడ్,అరవింద్ రెడ్డి, కే. శంకర్, తూము సంతోష్, మాజీ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సంధ్య, బండి సుధా, జహంగీర్, ఫణింద్ర, బచ్చు మల్లి, శ్రీకాంత్, నితీష్ గౌడ్, మణికంఠ, భార్గవ్ రెడ్డి , కళ్యాణ్, శివ గౌడ్, రంగ మోహన్ నళిని కాంత్, గోపాల్ చౌదరి.సరోజ, విజయ, జ్యోతి, సుజాత, స్వాతి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.