తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ పండుగను కాటేదాన్ డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్‌లో అత్యంత వైభవంగా, కన్నులపండువగా నిర్వహించారు. స్థానిక శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీడెం రమేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ​ప్రకృతిని ఆరాధించే ఈ పూల పండుగను కాలనీలోని మహిళలు, యువతులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునేలా ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ​

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… కాలనీవాసులందరూ ఒకే వేదికపైకి చేరి ఐక్యతతో పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసు కున్నామన్నారు. ​ఈ కార్యక్రమంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ అధ్యక్షుడు గద్దె కృష్ణ, సత్యసాయి పొదుపు సంఘం అధ్యక్షుడు పగిడిమర్రి సూర్యనారాయణ, వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్ కుమార్, నవోదయ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ​వీరితో పాటు ముషం నరేష్, మామిడి శెట్టి శ్రీనివాస్, అవ్వారి పరమేష్, గంజి యాదగిరి, శిరందాస్ నరేందర్, కైరం కొండ శంకర్, గంజి విజయ్, మలేష్, రావుల నవీన్, వై. భాస్కర్, భానుచందర్, శివ, వెంకటేష్, లాలిప్ మరియు పెద్ద సంఖ్యలో కాలనీ మహిళలు, చిన్నారులు, స్థానిక ప్రజలు హాజరై బతుకమ్మ పాటలతో ప్రాంగణాన్ని మార్మోగించారు.