తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ పరిధిలోని ప్రగతి కాలనీలో ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కాలనీలోని ఇళ్లకు వెళ్లి అర్హులైన పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను చేపట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు గోద పాండు యాదవ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల డివిజన్ కన్వీనర్ నవారు మురళీధర్ రెడ్డి, కో-కన్వీనర్లు కె. శ్రీకాంత్ రెడ్డి, పి. సంతోష్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు బొమ్మరాజు నరసింహ, కొవ్వకుల బాబు, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి ఉడుత లక్ష్మి, నాగమణి పాల్గొన్నారు.