తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :
దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కార్వాన్ ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మాతా క విశాల్ జాగరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్వాన్ ఇన్చార్జ్ జీవన్ సింగ్ మరియు పార్టీ సీనియర్ నాయకుడు అంబటి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా అమ్మవారి జాగరణ కార్యక్రమంలో పాల్గొని వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఉత్సవ సమితి సభ్యులు జీవన్ సింగ్ మరియు అంబటి శ్రీనివాస్లను ఘనంగా సన్మానించారు. వారికి శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
