తెలంగాణ ఎక్స్ ప్రెస్ news : తెలంగాణ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణకు రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మస్నా రవికుమార్ ఆధ్వర్యంలో నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా చైర్మన్ను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మస్నా రవికుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం లభించాలని పేర్కొన్నారు. చేనేత కార్మికుల అభ్యున్నతి, వారి ఆర్థిక అభివృద్ధి, సంప్రదాయ చేనేత వృత్తికి ఆదరణ పెంపొందించే దిశగా సంస్థ మరింత ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. నూతన కార్యాలయం ద్వారా సంస్థ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి బొల్ల వెంకటేశ్ నేత, మచ్చ వరలక్ష్మి, కంది బిక్షపతి నేత, కొంగరి కర్మశ్రీ, కోనంపేట నర్సింగ్ రావు, బోగ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై చైర్మన్ దూడం వెంకటరమణకు శుభాకాంక్షలు తెలిపారు.
