తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ : వేణుగోపాల గురుస్వామి పాదయాత్ర బృందం వారి ఆశీస్సులతో పవన్ గురుస్వామి ఆధ్వర్యంలో గురుస్వామి దొడ్ల రామకృష్ణ గౌడ్ హైదరాబాద్ నుండి శబరిమల వరకు వెళ్తున్న మహా పాదయాత్రలో భాగంగా ముఫై ఆరవ రోజైన ఈరోజు కేరళలోని కుమిలి చేరుకున్న శుభసందర్భంగా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, వారి మిత్రబృందం అయ్యప్ప స్వాములను కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, మురళీ మోహన్ కృష్ణ కుమార్, పద్మయ్య గౌడ్, పద్మయ్య గౌడ్, నాగేష్, సంతోష్ బిరాదర్, గురుస్వామి గుడ్ల మహీంద్ర (రాజన్న), స్వాములు వివేక్, మనీష్, చింటూ తదితరులు పాల్గొన్నారు.
