తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు వార్డు కార్యాలయంలో జీవిత బీమా నమోదు కొరకు వచ్చిన వారందరికీ ధ్రువీకరణ పత్రాలను పరీక్షించి జీవిత భీమా నమోదు ప్రక్రియను పూర్తిచేస్తున్న సందర్బంగ సంబంధిత అధికారులు మాట్లాడుతు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమం నవంబర్19 నుంచి డిసెంబర్18వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతున్నదని, అర్హులైన కుటుంబాలకు రూ.5లక్షల జీవిత బీమాను ప్రభుత్వం అందిస్తున్నందున్నదని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదును అర్హులైన ప్రతి ఒక్కరూ సరైన ధ్రువీకరణ పత్రాలను చూపించి నమోదు చేసుకోవాలని కోరారు.
