తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఖైతలపూర్ డివిజన్, అంజయ్య నగర్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బాసెట్టి నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, సమాజంలో విద్య, సమానత్వం, మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసినసేవలు చిరస్మరణీయమని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. పూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, తూము వేణు, తూము వినయ్, చున్నుపాషా, శంకర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.