తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ మసీదుబండ గ్రామంలోని శ్రీ స్వయంభు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనార్థమై 28వ తేది శనివారం పెద్దఎత్తున భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ, శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి ఆశీస్సులను పొందడం అదృష్టంగా భావిస్తున్నామని, ఆయురారోగ్యాలను పొందగలమని తమ ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేశారు. ఈ సందర్బంగ ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
