తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన 140వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని ఉప్పరపల్లిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం పార్టీ నాయకులు పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మన్ కీ బాత్ జిల్లా కో-కన్వీనర్ షాబాద్ విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు పసుపుల సందీప్ ముదిరాజ్, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, మైనార్టీ మోర్చా నాయకుడు షేక్ బాషా, బూత్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సతీష్, సంతోష్, ధ్రువిన్ పసుపుల, శౌర్య పసుపుల తదితరులు పాల్గొన్నారు.