తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని జంగమేట్ లో 200 మంది మహిళలకు నిత్యావసర సరుకులతో కూడిన రేషన్‌ కిట్లను టీపీసీసీ నేత పార్వతాల రాజేందర్‌ పంపిణీ చేశారు. పండుగ వేళ నిరుపేద మహిళలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్వతాల రాజేందర్‌ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకున్నారు.

సమాజంలోని పేద, నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషకరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మావిశంకె అచిల్‌, ఉదయ్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.