తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు కాటేదాన్ డివిజన్ మాజీ వార్డు సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమ శ్రీనివాస్ గుప్త హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని, ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని కోరుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దసరా పండుగ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, నూతనోత్సాహాన్ని నింపుతుందని అన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరికీ విజయాలను అందించాలని, యువతకు ఉజ్వల భవిష్యత్తు కలగాలని, రైతులు, కార్మికులు, వ్యాపారులు, మహిళలు, విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
