తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గాజుల నరేష్ యాదవ్ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాలను అందిస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయం, శాంతి, సంతోషం నిండాలని గాజుల నరేష్ యాదవ్ ఆకాంక్షించారు.

You missed