ఆలయం, చర్చి, మసీదులో ప్రార్థనలు నిర్వహించిన ఇల్లందకుంట పోలీసులు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ ఇల్లందకుంట, 25
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఇల్లందకుంట ఎస్సై ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంతో పాటు సిరిసేడు గ్రామంలోని చర్చి, మసీదులో ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమం, పోలీసు సిబ్బంది ఆయురారోగ్యాలు, ప్రజల భద్రత, శాంతి సౌభాగ్యాల కోసం ప్రార్థించినట్లు తెలిపారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఇల్లందకుంట పోలీస్ స్టేషన్
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్

ఆలయం, చర్చి, మసీదులో ప్రార్థనలు నిర్వహించిన ఇల్లందకుంట పోలీసులు