బీసీల రాజకీయ, సామాజిక, విద్యా, ఆర్థిక హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న గుజ్జ సత్యంకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీల ఆత్మగౌరవ పోరాటానికి రాజకీయ గుర్తింపు కల్పించాలని, బీసీ ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.

బీసీల హక్కుల సాధన కోసం ఎన్నో ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న గుజ్జ సత్యంకు తగిన రాజకీయ గుర్తింపు కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. బీసీల రాజకీయ, సామాజిక, విద్యా, ఆర్థిక హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న కృషిని గుర్తించి, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, బీసీ ఉద్యమ నాయకత్వానికి చట్టసభల్లో సముచిత స్థానం కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి మరింత బలం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు.

బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా బీసీ వర్గాల ఆకాంక్షలకు గుర్తింపు లభిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రాంత పద్మశాలి సంఘం కోశాధికారి బొమ్మ రఘురాం నేత, జాతీయ బీసీ సంఘం మహిళా విభాగం జాతీయ ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి గౌడ్, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు జెల్లా నరేందర్, వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీల బలం, ఐక్యతకు రాజకీయ అధికారం తోడవ్వాలని, బీసీల గొంతుకకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని నాయకులు కోరారు.

Avatar photo

By Murthy