తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 కమ్యూనిటీ హాల్ లో గ్రాడ్యుయేట్స్ ఓట్ల నమోదు కేంద్రాన్ని ఏర్పాటచేసి అర్హులైన ఓటర్ల ఓట్లను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించిన అర్హత కలిగిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని అన్నారు. ఓటు నమోదు కొరకు ఆన్లైన్ లో గానీ, మేము ఏర్పాటుచేసిన కేంద్రాలలో గానీ, శంషిగూడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా మీ ఓటును నమోదు చేసుకోవచ్చని తెలియచేశారు. మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల సమస్యలను తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, కట్టా శ్రీనివాసరావు, కొండారెడ్డి, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
