తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: దీపావళి పండుగను పురస్కరించుకుని మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రాంగణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సదర్ సమ్మేళనం గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వివిధ శాఖల మంత్రులు, రాష్ట్ర యాదవ కురుమ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మెన్ మారబోయిన రఘునాథ్ యాదవ్, యాదవ బాంధవుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్, గోధ నరేందర్ యాదవ్ తో కలిసి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సదర్ ఉత్సవాల్లో దున్నపోతుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాదవ బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు. అనంతరం, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, యాదవుల సంప్రదాయానికి ప్రతీక అయిన సదర్ పండుగను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాదవులు ఎంతో కష్టపడి పెంచిన దున్నపోతులను ఈ వేదికపై ప్రదర్శించడం ఎంతో గర్వకారణమని, యాదవ బంధువుల ఐక్యతను చాటే ఈ సదర్ ఉత్సవం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అందరికీ దీపావళి మరియు సదర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సత్యనారాయణ, రవీంద్ర చారీ, రాజు తదితరులు పాల్గొన్నారు.