తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్, నందమూరి నగర్ కాలనీ లో నెలకొన్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై విద్యుత్, జలమండలి అధికారులతో, కాలనీ వాసులతో కలసి పాదయాత్ర చేసిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ, హైదర్ నగర్, నందమూరి నగర్ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై విద్యుత్, జలమండలి అధికారులతో, కాలనీ వాసులతో కలసి పర్యటించి త్వరితగతిన సమస్యను పరిష్కరించేలా చూడాలని అధికారులకు చెప్పారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తిచేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు. చిన్న సమస్యైనా మా దృష్టికి వచ్చినట్లయితే తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే ప్రథమలక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధి సహకారంతో అన్ని రంగాలలో అభివృద్ధిచేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ విద్యుత్ ఏఈ మాధురి, లైన్ మెన్ కాలి, జలమండలి మేనేజర్ విలియం ప్రకాష్, సూపర్వైజర్ నరేంద్ర, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
