• యువ భారత సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కడియాల సురేష్ కుమార్ వెల్లడి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ నాయకుడు, విద్యావేత్త, సామాజిక సేవకుడు గుజ్జ సత్యం గారికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల ప్రైవేట్ పాఠశాలల్లో ‘లక్ష ఉత్తరాల కార్యక్రమం’ నిర్వహిస్తున్నట్లు యువ భారత సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కడియాల సురేష్ కుమార్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ అభిప్రాయాలను లేఖల రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిస్తున్నారు. బీసీ సంక్షేమం, సామాజిక న్యాయం, విద్యారంగ అభివృద్ధి, పేద విద్యార్థుల సమస్యలపై గుజ్జ సత్యం గారు చేస్తున్న కృషిని గుర్తించాలని విద్యార్థులు తమ లేఖల్లో ప్రస్తావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగా బీసీల హక్కుల కోసం గుజ్జ సత్యం గారు చేస్తున్న కృషితో పాటు విద్యావేత్తగా, ప్రజాసేవకుడిగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందని కడియాల సురేష్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ లక్ష ఉత్తరాల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విద్యార్థుల స్వచ్ఛంద భాగస్వామ్యంతో కార్యక్రమం కొనసాగుతోందన్నారు. గుజ్జ సత్యం గారి సేవలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ అంశాన్ని ముఖ్యమంత్రి పరిశీలించాలని యువ భారత సామాజిక వేదిక తరఫున కడియాల సురేష్ కుమార్ కోరారు.

Avatar photo

By Murthy