తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభికాలనీ, రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీలకు చెందిన ప్రధాన రహదారి పక్కన చెత్తను పడవేస్తుండటంతో వాహనదారులు పాదచారులు పిల్లలు దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతు అనారోగ్యానికి గురవుతున్నందున జిహెచ్ఎంసి అధికారుల ఆదేశాల మేరకు ఎస్ఆర్పీ బాలరాజు, ఎస్ఎఫ్ఏ శివ కుమార్ గత కొద్ది రోజులుగా వ్యాపార సముదాల వారికి రహదారి ప్రక్కన చెత్తను పడేవేస్తున్న వాహనదారులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్బంగ బాలరాజు, శివ కుమార్ మాట్లాడుతు, హెచ్చరికల ఉల్లంఘనకు పాల్పడితే జరిమానాలు తప్పవని ప్రధాన రహదారిలోని వ్యాపార సముదాయాల వారు చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకోవాలని, పరిమితులకు మించి రహదారులను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అతిక్రమించిన వారికి జరిమానాలను విధిస్తామని అవగాహన కల్పించారు.
